పోలీసుల‌పై ద్వ‌జ‌మెత్తిన చంద్ర‌బాబు.. ఎందుకంటే..

-

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దౌర్జన్యానికి దిగారని వెంకటాచలం ఎంపీడీవో సరళ అర్ధరాత్రి న్యాయదీక్ష చేశారు. తన ఇంటి పైన దాడి చేసారంటూ.. అర్ధరాత్రి ఆమే స్వయంగా నెల్లూరు రూరల్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అయితే దీని చంద్ర‌బాబు మాట్లాడుతూ.. నిజాయితీగా ఉన్న మహిళా అధికారిపై వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. న్యాయం కోసం మహిళా అధికారి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే పోలీసులు కేసు తీసుకోవడానికే జంకారంటే పోలీసింగ్ ఉన్నట్టా? లేనట్టా? అని తీవ్రంగా మండిపడ్డారు.

వైసీపీ నేతలు చెప్పిన అక్రమాలు చేయకపోతే మహిళా అధికారులని కూడా చూడరా?, ఆ అధికారి ఇంటికి కరెంట్ నీటి కనెక్షన్‌ను కట్ చేస్తారా? అని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఉంటే సీఎంకు ఇవేమీ కనపడవా? అని సూటిగా ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version