“రోజుకో ఘోరం… ప్రతిచోటా ప్రభుత్వ టెర్రరిజం” : చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై తాజాగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ద్వారా అగ్గిమీదగుగ్గిలం అయ్యాడు. ఈయన పెట్టిన పోస్ట్ లో… ఏపీలో అన్యాయం రాజ్యమేలుతోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, అనంతపురం జిల్లా ధర్మవరం లోని చేనేత వస్త్ర వ్యాపారాలు ఆగిపోయిన పాత బకాయిలను చెల్లించాలని అడిగినందుకు వారిపై దారుణంగా ప్రవర్తించింది ఈ ప్రభుత్వం అంటూ విమర్శించారు. ఈ వ్యాపారులపై విజయవాడలో అమానుషంగా వారిపై దాడి చేసి, నగ్నంగా వీడియోలు తీసి రాక్షసానందం పొందారని రెచ్చిపోయి మాట్లాడారు చంద్రబాబు. ఈయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకో ఘోరం ప్రభుత్వ టెర్రిరిజం అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు సాయంగా ఉండాల్సిన పోలీసు శాఖ వైసీపీకి అనుబంధ విభాగంగా మారిపోయిందని… చరిత్రలో ఈ విధంగా జరగడం మొదటిసారని ఆవేదనతో మాట్లాడారు చంద్రబాబు.

గన్ నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చేస్తున్న పాపాలు అన్నింటికి త్వరలోనే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version