తమిళనాడు లో గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అన్నా డిఎంకె ను ఓడించి స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె అధికారాన్ని చేజిక్కించుకుని స్టాలిన్ సీఎం అయ్యారు. తాను అధికారంలోకి వచ్చిన క్షణం నుండి తమిళనాడులో అభివృద్ధి సంక్షేమం విషయంలో ఎన్నో పధకాలను ప్రవేశ పెట్టి ప్రజల గుండెల్లో నికార్సైన నాయకుడిగా నిలిచాడు. తాజాగా డిఎంకె పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతిని పురస్కరించుకుని తమిళనాడు గృహిణులకు మంచి పధకాన్ని ప్రవేశ పెట్టాడు సీఎం స్టాలిన్. ఈ పధకం ప్రకారం ప్రతినెలా రూ. 10 వేలు అందించనున్నాడు, అయితే ఈ పధకం కోసం అర్హతలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి గృహిణికి ఖచ్చితంగా 25 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు కుటుంబ సంవత్సరం ఆదాయం రూ. రెండున్నర లక్షల లోపు ఉండాలి.