జగన్ సర్కార్ దిశ చట్టం చేశామని కోట్ల ప్రజాధనంతో ప్రచారం చేసుకున్నారని.. కానీ అమలులో ఆ దిశ చట్టానికే దిక్కులేకుండా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ పాలనలో 14నెలల్లో 400పైగా అత్యాచారాలు, 16గ్యాంగ్ రేప్‌లు జరిగాయని ధ్వజమెత్తారు. రాజమండ్రిలో మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ చేసి.. చివరకు నిందితులే పోలీస్ స్టేషన్ వద్ద విడిచిపెట్టారంటే నేరగాళ్లు ఏ స్థాయిలో పేట్రేగుతున్నారో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.
"దిశ" చట్టం చేసేశామని కోట్ల ప్రజాధనంతో ప్రచారం చేసుకున్న ప్రభుత్వం… అమలులో ఆ చట్టానికి దిక్కు లేకుండా చేసింది. మహిళలకు రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి, నిబద్దత ప్రభుత్వానికి ఉంటే ఈ వరుస అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి? (1/5)
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 20, 2020
రాజమండ్రిలో 16 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపించి ఆమెపై ఏడుగురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల పాటు బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం వారే ఆ బాలికను పోలీస్ స్టేషన్ ఎదుట పడేసి వెళ్లిపోయారు. అయితే దిశ చట్టం గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సీఎం జగన్ సర్కార్ ని నిలదీశారు.