సీఎం కేసీఆర్‌ని పెళ్లికి ఇన్వైట్ చేసిన హీరో నితిన్..!

-

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, షాలినీల వివాహం ఈ నెల 26వ తేదీన ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన పెళ్లికి రావాల్సిందిగా నితిన్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా నితిన్‌కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ఫలక్‌నామా ప్యాలస్‌లో సన్నిహితుల సమక్షంలో నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ పెళ్లి ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలైపోయాయి.

ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను అనుసరిస్తూ, తగిన జాగ్రత్తలు పాటిస్తూనే తన వివాహం జరపాలని చూస్తున్నాడు నితిన్. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇప్పటికే భీష్మ సినిమాతో హిట్ కొట్టిన నితిన్.. ప్రస్తుతం వెంకీ అట్లూరీతో ‘రంగ్ దే’.. చంద్రశేఖర్ యేలేటి ‘చెక్’.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘అంధాధున్’ రీమేక్‌.. కృష్ణచైతన్య దర్శకత్వంలో ‘పవర్ పేట’ సినిమాలు చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version