బాబు చేస్తున్న రాజకీయాలపై రోజు రోజుకీ తమ్ముళ్లలో వ్యతిరేకత ఎక్కువవ్వడంతోపాటుగా… కొన్ని విషయాలు అసలు వారికే అర్ధం కావడం లేదని.. ఎంత సమర్ధిద్దామన్నా కూడా సాధ్యం కాకుండా ఉంటుందని వాపోతున్నారట! అసలే మునుగుతున్న నావ అని ఇప్పటికే పార్టీపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి…. బాబు వయసు, ఆరోగ్యం విషయంలో ఉన్న భయాల రీత్యా చూస్తే… ఇక టీడీపీలో సరైన మాస్ లీడర్ దొరికే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు! పోనీ తండ్రి పేరు చెప్పి బాలయ్య ఏమైనా రంగంలోకి దిగుతారని అనుకుంటే… బాబు కనుసన్నల్లో ఉండే బాలయ్య అంత సాహసం చేయరనే కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి! ఈ క్రమంలో… పార్టీ కోసం ఎంతో కష్టపడిన జూ. ఎన్టీఆర్ ని కూడా బాబు దూరం పెడుతున్నారని అంటున్నారు విశ్లేషకులు!
ఈ విశ్లేషణలకు బలం చేకూరేలా బాబు ప్రవరన ఉంది!! తన పార్టీ నాయకులు ఎవరి బర్త్ డే రోజూయినా బాబు ట్విట్టర్ లో శుభాకాంక్షలు చెబుతారు! అంతెందుకు… పొరుగు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవెగౌడకి బర్త్ డే విషెస్ చెప్పారు బాబు! కానీ… పార్టీ కోసం ఎంతో పనిచేసిన జూ. ఎన్టీఆర్ కి మాత్రం మనస్పూర్తిగా పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పడానికి ఆలోచించలేకపోయారు! చంద్రబాబుకి జూ ఎన్టీఆర్ మరీ అంత పరాయివాడు అయిపోయాడా లేక బుడ్డోడంటే బాబుకు భయమా అనే అనుమానాలు ఆన్ లైన్ వేదికగా వ్యక్తమవుతున్నాయి!
అయితే ఇక్కడ బాబుకు జూ. ఎన్టీఆర్ అంటే భయమే అనేది గట్టిగా వినిపిస్తున్న మాట. ఈ సమయంలో బాబు అనంతరం పార్టీ మళ్లీ నందమూరి వారసుల చేతిలోకి వెళ్లాలనేది చాలా మంది టీడీపీ నేతలు బహిరంగంగా చెబుతున్న మాటే! ఈ సమయంలో బుడ్డోడు తప్ప పార్టీని ఇంకెవ్వరూ బ్రతికించలేరనేది వారి వాదన! వారి ఆలోచనల్లో లోకేష్ పేరు కనీసం ప్రస్థావనకు కూడా రాని పరిస్థితి! ఈ సమయంలో జూ. ఎన్టీఆర్ కి బర్త్ డే విషేస్ కూడా చెప్పడానికి బాబు ధైర్యం చేయలేకపోయారు! ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే… బాబు చెప్పక పోయినా కూడా మిగిలిన మెజారిటీ టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం!
అంటే… ఈ విషయంలో ఎన్టీఆర్ “సరే” అంటే.. బాబును సైతం పక్కకు పెట్టి తమ్ముళ్లంతా బుడ్డోడి వెనక నడవడం ఖాయం అనే సంకేతాలు ఇస్తున్నారనేది విశ్లేషకులు చెబుతున్న మాట! దీంతో జూనియర్ కి బర్త్ డే విషెస్ చెప్పకపోవడం వల్ల బాబుకి మరో కొత్త తలనొప్పి పడినట్లయ్యింది. ఇంతకాలం బాబుకు పార్టీపై పూర్తి పట్టు ఉందని… తనను కాదని పార్టీ నేతలు ఎవరూ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యరు అని భావించిన వారంతా… బాబు కు కూడా పార్టీపై పట్టు కోల్పోతుంది అని కామెంట్లు చేస్తున్నారు!!