విశాఖ వ్యవహారం: అటుతిరిగి ఇటుతిరిగి బాబు మెడకు చుట్టుకుంది!

-

ఏపీ ప్రతిపక్ష నేత టైం ఏమాత్రం బాగున్నట్లు లేదు! ఈ మధ్యకాలంలో ఏది ముట్టుకున్నా… అది తిరిగి తిరిగి తన మెడకే చుట్టుకుంటుంది! ఆ వ్యవహారంలో తన తప్పు ఉందని తెలిసి కూడా అడ్డంగా రంగంలోకి దిగడం… ఆ తర్వాత తానే అడ్డంగా బుక్కైపోవడం.. ఈ మధ్య బాబుకు పరిపాటిగా మారిపోయింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటిస్తే… పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అంటూ పలికి అభాసుపాలైన బాబు… తాజాగా ఆ కంపెనీ అనుమతులు, అడ్డగోలు ప్రోత్సాహాల విషయంలో మరోసారి ఇరుక్కున్నారు!

ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో ఏపీ సీఎం మాట్లాడటాన్ని తప్పుపడుతున్న టీడీపీ నేతల విషప్రచారంపై ఏపీ ప్రభుత్వం నుంచి ఆగ్రహావేశాలు వెళ్లివెత్తుతున్న దశలో… బాబే ఈ ఫ్యాక్టరీకి నిబందనలకు విరుద్దంగా అన్ని సహాయ సహకారాలు అందించారని తెలుస్తోంది. ఈ క్రమంలో… 1998 లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగితే చంద్రబాబు స్పందించని విషయాన్ని తాజాగా వైకాపా నేతలు గుర్తుచేస్తున్నారు! ఇదే క్రమంలో నిబంధనలకి విరుద్దంగా ఈ ఎల్జీ పాలిమర్స్‌ కు బాబు హయాంలోనే 2015లో విస్తరణకు సైతం అనుమతులు ఇచ్చారంట! అక్కడితో బాబుకీ – ఈ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకి అనుబందం అయిపోయిందనుకుంటే పొరపాటే!

అనంతరం… నిబంధనలకు వ్యతిరేకంగా ఏకంగా 2023 వరకు ఈ ఎల్జీ పాలిమర్స్‌ కు చంద్రబాబు అప్పట్లోనే అనుమతులిచ్చారంట! ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ అప్పటి పెందుర్తి ఎమ్మెల్యే మానం ఆంజనేయులు లేఖ రాసినా కూడా బాబు స్పందించలేదంట! ఇదే క్రమంలో ఇలా నిబంధనలకు విరుద్దంగా అనుమతులివ్వడంపై మాజీ ఐఏఎస్‌ అధికారి శర్మ ప్రశ్నలకు కూడా బాబు సమాధానం చెప్పలేదంట! ఇదే క్రమంలో… నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా సింహాచలం దేవస్థానానికి చెందిన వందల ఎకరాలని డీ నోటిఫై చేసి మరీ ఈ ఎల్జీ పాలిమర్స్‌ కు బాబు అప్పగించారంట!

ఇన్ని వ్యవహారాలు చేసిన బాబు… నేడు జనాలకు ఏమీ తెలియదన్నట్లు, తనపాపం ఏమీ లేదన్నట్లు… రాత్రుళ్లు నిద్రపట్టలేదు, చాలా బాదేసింది, కోటి రూపాయల నష్టపరిహారంతో ప్రాణాలు తిరిగి రావు, ఈ ఫ్యాక్టరీ ని వెంటనే మూసెయ్యాలి, జగన్ పద్దతేమి బాగాలేదు వంటి ఉపన్యాశాలు చేస్తున్నారు! దీంతో… ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి రావడంతో… బాబు మళ్లీ అడ్డంగా బుక్కయ్యారని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news