రాజకీయాలు చేయడంలో ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తర్వాతే ఎవరైనా అనేలా చేసేవారు. ఏ విషయాన్నైనా విషయాన్ని కూడా తనకు అనుకూలంగా తిప్పుకొని ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడంలో నారా చంద్రబాబు తర్వాతే ఎంతటి వారైనా. కానీ ప్రస్తుతం అలా లేదు. ప్రస్తుతం బీజేపీ అలాంటి స్థితిలో ఉంది. అందుకే ఏ చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ ముందుకెళ్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో నూ ఇప్పుడు బీజేపీ కొత్త రాజకీయాలకు తెరలేపుతోంది. అదేమిటంటే ప్రస్తుతం వస్తున్న వినాయక చవితిపై భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు తెర లేపింది. ఇప్పుడు కరోనా నిబంధనలు ఉన్న పరిస్థితిలో బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి పండుగలకు పర్మిషన్ నిరాకరించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. దీంతో దీన్ని మొదటగా బీజేపీ ఎక్కువ ప్రచారం చేసింది.
ఎందుకు అనుమతి ఇవ్వరంటూ విమర్శిస్తోంది. అన్ని పండుగలకు అనుమతి ఇచ్చి కేవలం హిందువుల ఫెస్టివెల్‌లకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటని అడుగుతోంది. ఇక ఇదే సబ్జెక్టుపై ప్రస్తుతం నారా చంద్రబాబు కూడా రంగంలోకి దిగారు. నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వినాయక చవితి పూజలకు తెలంగాణ రాష్ట్రం అనుమతించిందని అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అభ్యంతరం ఎందుకని ఆయన అడిగారు. ఈ మధ్యన ఎపీ వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫోటో కు నివాళి అర్పించేందుకు ఎటువంటి నిబంధనలు లేవా అని ప్రశ్నించారు. కానీ వినాయక చవితికి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇక వైఎస్ ఆర్ సీపీ విధానాలు సరికావని విమర్శిస్తున్నారు. వీటిని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. దాని కోసం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కరోనా రూల్స్ పాటిస్తూ 175 నియోజకవర్గాల్లో చవితి వేడుకలు నిర్వహించాని ఆదేశించారు. అడ్డుకుంటే నిరసనలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.