బాబు ఏమన్నా ప్లాన్ చేశావుగా…జనం చెవుల్లో పువ్వులు లేవులే..

-

సమయానికి తగ్గట్టుగా రాజకీయాలు చేయడంలో చంద్రబాబుని మించిన వారు లేరనే చెప్పొచ్చు. ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి ఎన్నిరకాలుగా రాజకీయం చేయాలో బాబుకు బాగా తెలుసు. అలాగే పరిస్తితులని తనకు అనుగుణంగా మార్చుకోవడంలో కూడా బాబు సమర్ధుడే. ఇప్పుడు ఏపీలో ఉన్న రాజకీయ పరిస్తితులని బాబు తనవైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే జగన్ దెబ్బకు బాబు గారికి చుక్కలు కనబడుతున్నాయి. ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనే తేడా లేకుండా టి‌డి‌పికి బొమ్మ కనబడుతోంది.

ఇలాంటి పరిస్తితుల్లో పార్టీని పైకి లేపి, తాను కూడా పైకి లేగాలని బాబు బాగానే ప్రయత్నిస్తున్నారు. అయితే అందుకోసం బాబు…వరుసపెట్టి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శిస్తూనే ఉన్నారు. కానీ ఎన్ని విమర్శలు చేసిన బాబు మాటలని జనం పట్టించుకోవడం లేదు…ఇంకా జనం…జగనే కావాలని కోరుకుంటున్నారు. దీంతో బాబు రివర్స్ స్ట్రాటజీలు అమలు చేయడం మొదలుపెట్టారు.

అందుకే సరికొత్త ఎత్తులు వేయడంలో బాబు బిజీ అయ్యారు. పరోక్షంగా వైసీపీ నేతలని రెచ్చగొట్టి, తమపై దాడులు చేయించుకునేలా బాబు గారు మంచి ప్లాన్ వేసినట్లు కనిపిస్తోంది. టి‌డి‌పి నేతలు విమర్శలు చేయడం వల్ల జగన్‌కే ఎక్కువ సింపతీ వస్తుంది. అందుకనే తనని ఎక్కువగా తిట్టించుకునేలా బాబు ప్లాన్ చేసుకుని సింపతీని కొట్టేద్దామని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో లోకేష్‌ని కూడా బాగా హైలైట్ చేయాలని అనుకుంటున్నారు. పోలీసుల పర్మిషన్ లేదని తెలిసిన ఈ మధ్య నరసారావుపేట వెళ్లాలని చూసిన లోకేష్‌, ఎంత హడావిడి చేశారో అందరికీ తెలిసిందే. అంటే పోలీసులు తనని అరెస్ట్ చేస్తే, ఇంకా హైలైట్ అవుతానని లోకేష్ అనుకున్నారు.

ఇక జగన్‌ని తిడితే వైసీపీ నేతలు ఊరుకోరు…కానీ కావాలనే జగన్‌ని టి‌డి‌పి నేతల చేత బూతులు తిట్టించి, వైసీపీ నేతలని రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తోంది. అలా రెచ్చగొట్టడం వల్లే జోగి రమేష్…చంద్రబాబు ఇంటికెళ్లారు. అక్కడ టి‌డి‌పి నేతలు, కార్యకర్తలు హడావిడితో, జోగి, వైసీపీ కార్యకర్తలు కూడా రచ్చ చేశారు. ఇక ఈ సీన్‌ని తమకు అనుకూలంగా మార్చుకుని..జగన్…బాబుపై దాడి చేయమని ఎమ్మెల్యేని, వైసీపీ కార్యకర్తలని పంపించారని ప్రజల్లో సింపతీ సాధించే కార్యక్రమం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిన బాబు గారి రాజకీయం జనాలకు అర్ధమైపోతుంది. ఈ రాజకీయ సెట్టింగులు వర్కౌట్ కావనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version