నా రాజీనామా కోరడానికి అయ్యన్నపాత్రుడు ఎవరు : హోం మంత్రి

-

అమరావతి : అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని.. దళిత హోం మంత్రిగా సీఎం జగన్ నాకు అవకాశం కల్పించడం టీడీపీ నేతలకు రుచించడం లేదని మండిపడ్డారు హోమ్ మంత్రి మేకతోటి సూచరిత, అయ్యన్నపాత్రుడు తనపై చేసిన వ్యాఖ్యలకు బాధ పడుతున్నానని… దళిత మహిళకు ఉన్నత పదవి ఇవ్వడం అయ్యన్నపాత్రుడుకు నచ్చడం లేదా ? అని ప్రశ్నించారు.

అయ్యన్న పాత్రుడు సంస్కార హీనంగా మాట్లాడారని.. సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి అసభ్యకరంగా దూషిస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్ష టీడీపీ జీర్ణించుకోలేకపోతుందని.. లా అండ్ ఆర్డర్ పై టీడీపీ మాటలు హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో వంగవీటి మోహన్ రంగ హత్యకు గురయ్యారని.. జగన్ పై హత్యాయత్నం చేస్తే టీడీపీ నేతలు ఎగతాళి చేశారన్నారు. “నన్ను రాజీనామ చెయ్యమని సీఎం చెప్తే ఇప్పుడే రాజీనామా చేస్తా. నన్ను రాజీనామా చేయాలని అందానికి నువ్వు ఎవరు “అంటూ ప్రశ్నించారు హోమ్ మంత్రి మేకతోటి సూచరిత. అయ్యన్నపాత్రుడు సమాజానికి పట్టిన చీడ అని.. రాష్ట్ర ప్రజలు కూడా అయ్యన్న పాత్రుడును ఓ మై సన్ అంటారని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version