చంద్రబాబు ఇంటింటికీ బెంజ్ కార్ అంటున్నాడు..నమ్ముతారా: సీఎం

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఏపీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు కుళ్లు మెదడుకు ఎప్పుడైనా వచ్చిందా అని సీఎం జగన్ మండిపడ్డారు. తాజాగా చింతపాలెం లో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…’ప్రత్యేక హోదా తెస్తానని మాట తప్పాడు. ఇప్పుడు ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు అనేలా హామీలిస్తున్నాడు అని విమర్శించారు. అక్కా, చెల్లి నమ్ముతారా? మా పాలనలో 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. అమ్మఒడి, చేయూత, చేదోడు లాంటి పథకాలు ఎప్పుడైనా చూశారా?. ఇంటింటికీ పౌర సేవలందేలా మహా వ్యవస్థను ఏర్పాటు చేశాం’ అని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.

అబద్ధాలు, మోసాలు, కుట్రదారులను ఓడించేందుకు ప్రజలంతా సిద్ధమా? కూటమి కుట్రదారులను ఓడించేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. మన సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉక్రోశం, కడుపుమంటతో మనపై దాడులు చేస్తున్నారు’ అని సీఎం జగన్ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news