40 ఇయర్స్ ఇండస్ట్రీ… జగన్ ని అలా కాపాడేస్తుంది!

-

గతంలో చూసిన చంద్రబాబు నేడు లేరు.. ఈయన ఆయన కాదు.. లోకేష్ రంగప్రవేశం అనంతరం బాబు మారిపోయారండి.. అంటున్నారు టీడీపీ నేతలు – కార్యకర్తలు! ప్రజలకు మంచి చేసినా, చెడు చేసినా.. రాజకీయాలు మాత్రం పక్కాగా చేసేవారు చంద్రబాబు! కేంద్రంలోని బీజేపీని సైతం బుట్టలో వేయగల నేర్పరితనం.. పునాదులు కూడా మరిచిపోయి బాబుకోసం పనిచేసేలా కమ్యునిస్టులను మాయచేయగల సమర్ధత బాబు సొంతం.. కానీ అది గతం!

అవును… ఆ రాజకీయం నేడు గతం అయిపోయింది. జగన్ యువకుడు, అనుభవం లేని వ్యక్తి అని ప్రచారం చేసుకున్న టీడీపీకి జగన్ ను ఎదుర్కోవడం కష్టం అవుతుంది! 2019 ఎన్నికల ఫలితాలు ఒక లెక్క అయితే.. అనంతరం ఉన్న 23 కూడా తగ్గుముఖం పట్టడం మరొ లెక్క అయితే… అమరావతి – మూడు రాజధానుల వ్యవహారం ఇంకో లెక్క అయిన పరిస్థితి. ఈ క్రమంలో బాబు కేవలం కోర్టులనే నమ్ముకున్నారు! ప్రస్తుతం జగన్ కు అదే బలమవుతుంది!

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం నుంచి ఇప్పటివరకూ జగన్ సర్కార్ చేపట్టిన పనులలో సుమారు 60 – 70సార్లు కోర్టులో ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ విషయం జనాల్లోకి వెళ్లింది. జగన్ ఏమి చేద్దామన్నా చంద్రబాబు అడ్డుకుంటున్నారు.. కోర్టులను ఆశ్రయించి ఆలస్యం చేస్తున్నారు అన్న సంకేతాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయాయి. దీంతో… జగన్ ఏమి చేయకపోయినా… అందుకు కారణం బాబు అనే ఆలోచన ఇప్పటికే జనాల్లోకి వచ్చేసింది!

జగన్ ముఖ్యమంత్రి అయ్యేటప్పటికే రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమాత్రం బాగోలేని స్థితి. మూలిగేనక్కమీద తాటికాయ పడ్డట్లుగా కరోనా కాటేసింది! దీంతో జగన్ ఉన్నంతలో సర్ధుకుంటూ పనులుచేసుకోవాల్సిన పరిస్థితి. పైగా జగన్ సంక్షేమ పథకాల అమలు మరీ ప్రాధ్యాన్యం. ఈ సమయంలో జగన్ అభివృద్ధి చేయలేకపోయినా… అందుకు కారణం చంద్రబాబు కోర్టులను ఆశ్రయించడమే.. లేకపోతే జగన్ చేసేవారే అనే కామెంట్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో.. అయినదానికీ కానిదానికీ కోర్టులను ఆశ్రయించడం వల్ల… 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఉన్న బాబు.. పరోక్షంగా జగన్ ను కాపాడేస్తున్నారనే కామెంట్లు పెరిగిపోతున్నాయి.

జగన్ చేస్తున్న పనుల్లో “అది వద్దు” అని చెప్పగలుగుతున్నారు.. కోర్టులను ఆశ్రయించగలుగుతున్నారే కానీ… ఏమి కావాలో, ఏమి చేస్తే జనాలకు మేలు జరుగుతుందో చెప్పడంలో మాత్రం బాబు ఫెయిలవుతున్నారు. జగన్ చేస్తుంది తప్పు అని చెప్పగల బాబు మాటలు జనం నమ్మాలంటే… ఏది కరెక్టో కూడా బాబు చెప్పాలి. కానీ అది జరగడం లేదు. దీంతో… కావాలనే ఏపీ అభివృద్ధికి బాబు ఆటంకం కలిగిస్తున్నారనే కామెంట్లు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం జగన్ కి అదే బలం అవుతుంది అని అంటున్నారు విశ్లేషకులు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version