రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం అని పదే పదే గొప్పులు చెప్పుకునే చంద్రబాబు కేవలం 4 నెలల్లోనే తేలిపోయారా ? జగన్ దూకుడు ముందు చంద్రబాబు రాజకీయం ఎందుకు కొరకాకుండా పోతుందా ? అంటు అవుననే ఆన్సర్లే ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జగన్ సర్కార్ తీసుకున్న వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించడంతో ఏపీకి మూడు రాజధానులు వచ్చేశాయి. ఇక్కడే చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు పెద్ద ప్రమాదంలో పడింది. చంద్రబాబు ముందు నుంచి అమరావతికి అనుకూలంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. అక్కడే ఆయనకు అటు ఉత్తరాంధ్రలోనూ, ఇటు సీమలోనూ ఉన్నట్టుండి ప్రజాదారణ పడిపోయింది. సీమలో గత ఎన్నికల్లో టీడీపీ ముక్కి మూలిగి కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకుంది.
ఇప్పుడు బాబు రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని పట్టుబట్టడంతో అటు ఉత్తరాంధ్ర, ఇటు సీమలో టీడీపీ పాతాలంలోకి వెళ్లిపోయింది. జగన్ అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడు అయితే మూడు రాజధానుల ప్రకటన వస్తుందని ప్రకటించారో అప్పటి నుంచే టీడీపీ నేతలు, చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెట్టడం ప్రారంభమయ్యాయి. ఇక ఇప్పుడు అమరావతి కోసం చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తామని చెపుతున్నా ఈ విషయంలో ఆయనతో కలిసొచ్చే నేతలు ఎవ్వరో చెప్పలేం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు వైజాగ్ రాజధాని వస్తే అమరావతికి మద్దతుగా రాజీనామాలు చేస్తారని ఊహించలేం.
పైగా గంటా లాంటి నేతలు పార్టీ మారేందుకు ముహూర్తం ఖరారైందని అంటున్నారు. ఇక ప్రకాశం జిల్లాతో పాటు సీమలోని ఎమ్మెల్యేలు, పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళితే గెలుస్తామన్న నమ్మకాల్లో లేరట. అయితే చంద్రబాబు గతంలో తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలిచిన ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారట. అయితే కేసీఆర్ వేరు, ఆ ఉద్యమం పంథా వేరు.. తెలంగాణ ఉద్యమాన్ని అమరావతి ఉద్యమంతో పోల్చి చూసుకోవడం మూర్ణత్వమే అవుతుంది. అసలు అమరావతిలో ఉద్యమం జరిగినట్టు చాలా మందికి తెలియదు. అమరావతిలో ఓ ఐదారు గ్రామాల ప్రజలకు మినహా అక్కడ ఉద్యమం ఉందా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి.
జగన్ నిర్ణయం దెబ్బకు ఇప్పటికే ఉత్తరాంధ్ర, సీమలో చంద్రబాబు కోలుకోలేని దెబ్బ తగలగా… ఇప్పుడు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళితే చివరకు కుప్పంలో అయినా చంద్రబాబు గెలుస్తారన్న గ్యారెంటీ లేదంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఏదైనా తేడా జరిగితే చంద్రబాబు అస్త్రసన్యాసం చేసి రాజకీయంగా రిటైర్మెంట్ ప్రకటించి తప్పుకోవచ్చు.