నా రికార్డులు బద్దలు కొట్టాలంటే చాలా స‌మ‌యం ప‌డుతుంది : చంద్ర‌బాబు

త‌న జీవితంలో ఇంత‌టి అవ‌మానాలు ఎప్పుడూ భ‌రించ‌లేద‌ని చంద్రాబాబు అన్నారు. అవ‌మానాలు చేసినా భూతులు తిట్టినా భ‌రించాన‌ని కానీ ఈ రోజు త‌న భార్య‌ను కించ‌ప‌రిచార‌ని చంద్రబాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆరోజు నిండు స‌భ‌లో ద్రౌప‌తికి అవ‌మానం జ‌రిగింద‌ని….ఇప్పుడు ఉన్నది కూడా కౌర‌వ స‌భేన‌ని అన్నారు. అది గౌర‌వం లేని స‌భ అని టీడీపీ కార్యాల‌యంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

chandrababu naidu
chandrababu naidu comments

గౌర‌వంగా బ‌తికేవాళ్ల‌ను కించ‌ప‌రుస్తున్నార‌ని…న‌ల‌భై ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉంది అవ‌మాన‌ప‌డ‌టానికేనా అంటూ చంద్రబాబు ప్ర‌శ్నించారు. త‌న‌ను సంయ‌మ‌నం పాటించాన‌ని త‌న‌కు బూతులు రాక‌నో….తిట్ట‌డం రాకనో కాద‌ని అన్నారు. అది త‌మ విధానం కాద‌ని జ‌గ‌న్ భ‌స్మాసురుడిగా మారార‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. అంతేకాకుండా త‌న‌కు ప‌ద‌వులు అవ‌స‌రం లేద‌ని త‌న రికార్డులు బద్ద‌లు కొట్టాలంటే చాలా స‌మ‌యం పడుతుంద‌ని వ్యాఖ్యానించారు.