ఫీజు రీయింబర్స్మెంట్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల ఖాతాలోకే నేరుగా డబ్బులు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు బంద్ అయ్యాయి. ఈ మేరకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం ప్రకటన చేసింది.

ఇలాంటి తరుణంలోనే… ఫీజు రీయింబర్స్మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. కాలేజీ అకౌంట్లో కాకుండా విద్యార్థి అకౌంట్లోకి డబ్బులు వేసే ఆలోచన చేస్తున్నారు. తల్లిదండ్రుల పేరుతో జాయింట్ అకౌంట్ ఉండేలా ప్రభుత్వం యోచిస్తోంది. నేరుగా డబ్బులు విద్యార్థుల ఖాతాలోకి వెళ్తే ఉపయోగమని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది.