తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. 24న సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి, దర్శించుకుంటారు.

ఇటు 28వ తేదీన రాత్రి 7 గంటలకు జరిగే గరుడవాహన సేవను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. దీంతో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అటు తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. తిరుమల శ్రీవారి దర్శనాలకు 12 నుంచి 15 గంటలు పడుతున్నట్లు టీటీడీ పాలక మండలి వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 31 కంపార్ట్ మెంట్లలలో భక్తులు క్యూ లైన్ లో ఉన్నారు. ఇక నిన్న ఒక్క రోజే..65,066 భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.