అక్టోబర్ 1వ తేదీ నుండి రేషన్ షాపులు బంద్

-

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బిగ్ అల‌ర్ట్. అక్టోబర్ 1వ తేదీ నుండి రేషన్ షాపులు బంద్ కానున్నాయి. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని పౌర సరఫరా శాఖకు సమ్మె నోటీసులు ఇచ్చారు రేషన్ డీలర్లు.
వచ్చే నెల 1వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేయనున్నట్టు ప్రకటించాయి రేషన్ డీలర్ల సంఘాలు. ఈ మేర‌కు ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేశాయి.

Ration shops, Telangana
Ration shops to be closed from October 1st

కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ నిధులు విడుదల చేయడం లేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రేషన్ డీలర్ల సమ్మె బాట ప‌ట్టేందుకు సిద్దం చేశారు. వెంటనే నిధులు విడుదల చేయకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తూ పౌర సరఫరా శాఖకు సమ్మె నోటీసులు ఇచ్చిన రేషన్ డీలర్లు… అక్టోబర్ 1వ తేదీ నుండి రేషన్ షాపులు బంద్ చేసేందుకు రెడీ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news