అమరావతి రాజధానిగా ప్రకటించండి పదవులు వదిలేస్తాం: చంద్రబాబు నాయుడు

-

అమరావతిపై మీరు ఎన్నిరకాలుగా మాట్లాడతారని వైఎస్ఆర్సిపి నేతలను చంద్రబాబు ప్రశ్నించారు. ధైర్యముంటే ఎన్నికలకు వెళ్దాం.. రండి అని సవాల్ చేశారు. రైతులతో జరిగిన ఒప్పందాన్ని కాపాడాలన్న చంద్రబాబు… కేంద్రం జోక్యం చేసుకుని రాజధానిని కాపాడాలని కోరారు. వైఎస్ఆర్సిపి, కాంగ్రెస్ నేతలు జగన్‌ను నిలదీయాలన్న చంద్రబాబు… అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయడం తప్పని పేర్కొన్నారు. అమరావతిపై ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని హితవు పలికారు. రాజధానిని మార్చే అధికారం వైకాపాకు లేదని స్పష్టం చేశారు.రామాలయానికి భూమిపూజ చేయడం శుభకరమని చంద్రబాబు పేర్కొన్నారు. రామాలయం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారన్న చంద్రబాబు… 200 నదుల పవిత్ర జలాలతో భూమిపూజ చేశారని వివరించారు.

Chandra babu

అమరావతిలో 30 నదుల పుణ్యజలాలతో భూమిపూజ చేశారని గుర్తుచేశారు. అమరావతికి అండగా ఉంటామని శంకుస్థాపన సమయంలో ప్రధాని చెప్పారన్న చంద్రబాబు… ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు.. ఇప్పుడేం చేస్తున్నారని నిలదీశారు. ప్రజలను నమ్మించి ద్రోహం చేశారు, వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.ఇప్పుడు సవాల్ చేస్తే ఏదోదే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తమకు పదవులు ముఖ్యం కాదని… అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటిస్తే తమ పదవులకు రాజీనా చేస్తామని ప్రభుత్వానికి సవాల్ చేశారు. ఈ సవాల్​కు సిద్ధపడి జగన్​ తన నిర్ణయాన్ని ప్రకటించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version