భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా షియోమీ ఇండిపెండెంట్ డే సేల్‌ను నిర్వహించనుంది. ఇందులో భాగంగా షియోమీకి చెందిన అనేక ఉత్పత్తులను తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో షియోమీ ఇటీవలే విడుదల చేసిన రెడ్‌మీ నోట్ 9 సిరీస్ ఫోన్లను కూడా విక్రయించనుంది. ఈ సేల్ ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలోనూ కొనసాగుతుంది. ఆగస్టు 6 నుంచి 11వ తేదీ వరకు సేల్‌ను నిర్వహిస్తారు.
ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు రెండూ ఆగస్టు 6 నుంచి ప్రత్యేక సేల్స్‌ను నిర్వహించనున్నాయి. దీనికి షియోమీ సేల్ కూడా తోడు కానుంది. ఇందులో భాగంగా షియోమీ గోల్డ్, ప్లాటినం, డైమండ్ ఎంఐ వీఐపీ క్లబ్ మెంబర్లు షియోమీ ఉత్పత్తులను తక్కువ ధరలకే పొందవచ్చు.
సేల్‌లో భాగంగా రెడ్‌మీ కె20 ప్రొకు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.22,999 ధరకు విక్రయిస్తారు. రెడ్‌మీ నోట్ 9 సిరీస్ ఫోన్లను రూ.11,999 ప్రారంభ ధరకు అమ్ముతారు. రెడ్‌మీ నోట్ 9 ప్రొ ఫోన్లను రూ.13,999 ప్రారంభ ధరకు కొనవచ్చు. అలాగే రెడ్‌మీ నోట్ 9 ప్రొ మ్యాక్స్ ఫోన్‌ను రూ.16,999 ధరకు కొనవచ్చు.
సేల్‌లో రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను రూ.1599కు విక్రయిస్తారు. ఎంఐ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ 2 ను రూ.5499కు బదులుగా రూ.3599కు అమ్ముతారు. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ 32 ఇంచుల టీవీని రూ.14,999కు బదులుగా రూ.11,999కు కొనవచ్చు. ఎంఐ స్మార్ట్‌బ్యాండ్ 4ను రూ.2099 ధరకు, రెడ్‌మీ 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్‌ను రూ.1399 ధరకు, ఎంఐ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌ను రూ.1099 ధరకు కొనవచ్చు.
సేల్‌లో భాగంగా ఎంఐ సూపర్ బేస్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను రూ.1599 ధరకు కొనవచ్చు. అలాగే ఎంఐ నోట్‌బుక్ 14 హారిజాన్ ఎడిషన్, ఎంఐ నోట్‌బుక్ 14 ల్యాప్‌టాప్, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ ఎల్ఈడీ వైఫై స్మార్ట్ బల్బ్, మెన్ స్పోర్ట్స్ షూస్, ఎంఐ రీచార్జబుల్ ఎల్ఈడీ ల్యాంప్, ఎయిర్ ప్యూరిఫైర్ 2సి, బిజినెస్ కాజువల్ బ్యాక్‌ప్యాక్ తదితర ఉత్పత్తులను కూడా తక్కుద ధరలకే అందివ్వనున్నారు.