దేశంలో.. అంటే బాబు స్థాయిని తగ్గించినట్లు అవుతుందేమో… ప్రపంచంలో ఎక్కడ ఏ మంచిపని జరిగినా, ఏ గొప్ప పై జరిగినా దాన్ని క్యాష్ చేసుకునే విషయంలో బాబు పీ.హెచ్.డి. చేశారన్న అతిశయోక్తి కాదేమో. అసలు తనకు ఏమాత్రం సంబందలేని, తన ప్రమేయం ఏమాత్రం లేని విషయాల్లో సైతం క్రెడిట్ పొందగల దిట్ట చంద్రబాబు! ఈ క్రమంలోనే ఏపీలో ఇంతకాలం పొందిన ఫ్రీ క్రెడిట్ ఇకపై బాబుకు దక్కకుండా చేయబోతున్నారు సోము వీర్రాజు!
ఇంతకాలం ఏపీలో ప్రభుత్వంపై ఎవరు పోరాడినా.. ప్రభుత్వంపై ఎవరు విమర్శలు చేసినా.. తర్వాతి రోజు పేపర్లో అవి బాబు ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు జరిగేవి. చంద్రబాబు విమర్శలు చేసి ఊరుకుంటే.. వాటిపై కన్నా మరింత బలంగా వాయిస్ పెంచినా కూడా.. అది బాబు ఖాతాలోనే పడేది. ఫలితంగా బీజేపీ – జనసేన ప్రతిపక్ష కష్టం అంతా బాబుపాలయ్యేది! అయితే కొత్తగా బాధ్యతలు తీసుకున్న సోము వీర్రాజు… ముందుగా ఈ విషయంపైనే ఫోకస్ పెట్టారని, ఫలితంగా బాబుకు చెక్ పెట్టాలని భావిస్తోన్నారని తెలుస్తోంది!
ఇప్పుడు సోము వీర్రాజు పగ్గాలు చేపట్టడంతో ఏపీ బీజేపీ శైలిలో మార్పు వస్తుందని ఏపీ బీజేపీ కార్యకర్తలతో పాటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరగబోతోందనే సంకేతాలు గత రెండు రోజులుగా వీర్రాజు మీడియా ముఖంగా ఇస్తోన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా బీజేపీ చేపట్టే పోరాటాలు టీడీపీకి అడ్వాంటేజ్ గా మారకుండా సోము వీర్రాజు జాగ్రత్తలు తీసుకోనున్నారట. ప్రస్తుతం కరోనా కాలంలో ఏపీ వాసులకు కనుమరుగైపోయిన చంద్రబాబుకు మామూలు దెబ్బ కాదు!
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతాపార్టీ ఎదుగుదలకు వివిధ సందర్భాల్లో ఆటంకంగా పరిణమించారనే చెబుతుంటారు అసలు సిసలు కాషాయ వర్గాలు. గతంలో స్వతంత్రంగా ఎదిగేందుకు అవకాశం వచ్చిన ప్రతిసారీ పొత్తు పేరు చెప్పి.. ఏపీలో బీజేపీ ఎదుగుదలను వ్యూహాత్మకంగా తొక్కడమే కాకుండా.. ఆ పార్టీ క్రెడిట్ ను బాబు అద్భుతంగా క్యాష్ చేసుకునేవారు! అయితే… సోము వీర్రాజు ఈ అన్ని విషయాలపైనా దృష్టి సారించబోతున్నారని.. ఫలితంగా బాబుకు ఇకపై ఫ్రీ పబ్లిసిటీ, ఫ్రీ క్రెడిట్ రాదని అంటున్నారు!!