పాడేరు బస్సు ప్రమాద ఘటనపై స్పందించిన చంద్రబాబు

-

అల్లూరి జిల్లా పాడేరులో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం పట్ల చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్పష్టం చేశారు. అసలు, ప్రమాదానికి గల కారణాలను వెలికి తీసేందుకు ఘటనపై విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా, పాడేరు ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వారిలో కొందరిని నర్సీపట్నం ఆసుపత్రికి, మరికొందరిని విశాఖ కేజీహెచ్ కు తరలించారు.

కాగా.. పాడేరు ఘాట్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. వీరిలో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. చోడవరం నుంచి పాడేరు వెళ్తున్న బస్సు ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ వద్ద అదుపు తప్పి 50 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణీకులు వున్నారు. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version