యూరియాపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకాన్ని తగ్గిస్తే రైతులకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గించే ప్రతి కట్టకు రూ. 800 నేరుగా రైతులకు అందజేస్తామని వివరించారు సీఎం చంద్రబాబు.

యూరియా ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు. వచ్చే ఏడాది నుంచి ఎంతవరకు యూరియా అవసరమో అంతే వినియోగించాలని పేర్కొన్నారు. యూరియా ఎక్కువ వాడితే ఎక్కువ పంట వస్తుందనుకోవడం సరికాదని స్పష్టం చేశారు. ఏపీలో క్యాన్సర్ టాప్-5 రోగాల జాబితాలో ఉంది.. వాడకం ఇలాగే కొనసాగితే క్యాన్సర్లో నంబర్-1కి వెళ్లిపోతామని వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు.