ఏఐ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ఏఐ జనరేటెడ్ ఫోటోలు, వీడియోలు, ఆర్టికల్స్ అన్నింటికీ కచ్చితంగా లేబుల్ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలంటూ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా రిపోర్టును లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఏఐ కంటెంట్ సాధారణ పౌరులతో పాటు వీఐపీలను కూడా అయోమయానికి గురి చేస్తుందని పేర్కొంది.

ఏఐ వినియోగం అధికంగా పెరగడం వల్ల అనేక రకాల నకిలీ వార్తల వ్యాప్తి విపరీతంగా పెరుగుతుంది. ఈ కారణం వల్లనే కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఫేక్ వార్తలు, స్టోన్ కంటెంట్, ఫ్రాడ్ చేసేవారికి చెక్ పెట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉండదా… ఏఐ వినియోగం విపరీతంగా పెరిగింది. దీనివల్ల ఎలాంటి సమాచారం అయినా సులభంగా తెలుసుకుంటున్నారు. సమాచారం తెలుసుకోవడానికి ఏఐ ఎంతో బాగా ఉపయోగపడుతుందని క్షణాల్లోనే పనిచేస్తుందని అందరూ దీనినే ఎక్కువగా వాడుతున్నారు. అయితే దీనిని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు.