చంద్రబాబులో ఎందుకీ మార్పు..

-

ముహూర్తాలపై నమ్మకం ఉన్నవారు.. ఏదైనా పని మొదలుపెట్టాలంటే పక్కాగా వాటిని ఫాలో అవుతారు. వారం, వర్జ్యం చూసుకుంటారు. ఇప్పుడీ ఆచారం టీడీపీలో కూడా కనిపిస్తోంది. వారం, వర్జ్యం చూసుకుని పనులు చేస్తున్నారు చంద్రబాబు. టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీల ప్రకటన సమయంలో ఇదే చేశారు. మంచిరోజుతోపాటు ఆ రోజు ముహూర్త బలం ఎలా ఉందో తెలుసుకుని మరీ ప్రకటను చేయడం ఇప్పుడు టీడీపీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తుంది.

ఏదో పెళ్లికి ముహూర్తం పెట్టినట్టుగా ఘడియలు.. విఘడియాలు లెక్క చూసి మరీ పార్టీ కమిటీల లిస్ట్‌ రిలీజ్‌ చేశారు చంద్రబాబు. గతంలో టీడీపీ అధినేతలో ఇలాంటి పట్టింపులు లేవంటారు పార్టీ నాయకులు. కానీ.. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ముహూర్తాలు, వాస్తు లెక్కలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట. అయితే 2019 ఎన్నికల సమయంలో ఇలాంటి ఎన్ని మంచి రోజులు, మంచి ముహూర్తాలు చూసుకున్నా ఓటమి తప్పలేదు. అదీ… ఊహకందని విధంగా పరాజయం ముటగట్టుకున్నారు. ఇప్పుడు విపక్షంలోకి వచ్చాక వాటికి ప్రాధాన్యం తగ్గించకపోగా.. మరింత పెంచారట.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 27న ఏపీలో పార్లమెంట్‌ నియోజకవర్గాల అధ్యక్షులను ప్రకటించారు. దానికి ఆ రోజు ఉదయం 11 గంటల 50 నిమిషాలను ముహూర్తంగా నిర్ణయించారు. సెప్టెంబర్ 27వ తేదీ పార్లమెంట్ నియోజకవర్గాల అద్యక్షుల ప్రకటన జరిగింది. దానికి ఆ రోజు 11 గంటల 50 నిమషాలు మూహూర్తంగా నిర్ణయించారు. ఆ తరువాత వచ్చిన రాష్ట్ర తెలంగాణ కమిటీ, జాతీయ కమిటీ కూడా ముహూర్తం ప్రకారమే విడుదల చేశారు. ఇక 6 వతేదీ వచ్చిన ఎపి టిడిపి కమిటీ కూడా ముహూర్తం చూసుకునే ప్రకటించారు. కేవలం మంచి రోజే కాకుండా సరిగ్గా గంటలు..నిముషాల లెక్కలు చూసి మీర లిస్టులు విడుదల చేస్తున్నారు. గతంలో ఈ స్థాయిలో ముహూర్తాలు, మంచి రోజుల కోసం టిడిపి పట్టు పట్టిన సందర్భాలు లేవు.

అయితే రాష్ట్రంలో పరిణామాలు, పార్టీ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి అంశాన్ని ప్రతిపక్షం ముఖ్యమైనది గానే భావిస్తుంది. మంచి రోజు, మంచి సమయం చూసి ప్రకటన ఇస్తే పార్టీ పూర్తిగా గాడిలో పుతుందని.. పార్టీ పెద్దలు బావిస్తున్నారు అనే చర్చ జరుగుతుంది. ఈ విషయంలో ఎవరు ఏ సలహా ఇచ్చినా అధినేత పాటిస్తున్నారట. ఆ కారణంగానే టిడిపిలో ఇప్పడు వారం, వర్జ్యంపై ప్రాదాన్యత ఇస్తున్నారట. టిడిపిలో ఈ కొత్త పోకడలు ఎంత వరకు మార్పు తెస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version