చంద్రబాబు సెటైర్లు… బెంబేలెత్తిపోతుంది ఎవరు?

-

ప్రస్తుతం రాజకీయంగా.. గతంలో చేసిన అక్రమాలు అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చంద్రబాబు! ఈ విషయంలో ఇప్పటికే ఎన్నో విషయాల్లో స్టేలు తెచ్చుకునే సమర్ధత పుష్కలంగా కలిగిఉన్న బాబుకు సుప్రీంకోర్టు తాజా ఆర్డర్ టెన్షన్ పుట్టిస్తుందని అంతా అంటుంటే.. కాదు కాదు జగన్ కే ఎక్కువ టెన్షన్ అని అంటున్నారు చంద్రబాబు!

ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ ఏడాది లోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. దేశంలో 4,500 మంది ప్రజా ప్రతినిధులపై రోజువారీ విచారణ చేపట్టారు! దీంతో రాజకీయనాయకులు బెంబేలెత్తిపోతున్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి! అయితే ఈ విషయంలో జగన్ బెంబేలెత్తిపోతున్నారని సెటైర్లు వేస్తున్నారు చంద్రబాబు!  దీంతో మైకందుకున్నారు వైకాపా నేతలు!

నిజం చెప్పాలంటే జగన్ కు ఇది కొత్త సంభరం కాదు! తనపై వచ్చిన ఎన్నో కేసులను ధైర్యంగా ఎదుర్కొన్న చరిత్ర జగన్ సొంతం. అయితే.. ఈ విషయంలో ఇప్పటివరకూ స్టేలు తెచ్చుకుని నెట్టుకొస్తున్న బాబుదే టెన్షన్ అని అంటున్నారు వైకాపా నేతలు! అందులో భాగంగానే తమ అత్తగారు లక్ష్మీపార్వతిపై ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలుస్తోంది! బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి కేసులు వేసిన సంగతి తెలిసిందే! ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే ఆమె ప్రకటించారు!

దీంతో చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు.. తనపై వేసిన కేసులు వెనక్కి తీసుకోవాలని లక్ష్మీపార్వతి పై ఒత్తిడి తెస్తున్నారంట. ఈ విషయం లక్ష్మీపార్వతే బహిరంగంగా చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో… తాజా సుప్రీం కోర్టూ ఆదేశాలతో బాబు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోపల మాత్రం బెంబేళెత్తిపోతున్నారని, అందులో భాగంగానే బలవంతపు నవ్వులని అంటున్నారు!! మరి చూడాలి.. ఎవరిపై కేసులు ఎలా తేలతాయనేది!!

Read more RELATED
Recommended to you

Exit mobile version