హైదరాబాద్ ట్రాఫిక్ అప్డేట్ : ఈ రోడ్లలోకి అస్సలు పోకండి !

-

భారీ వర్షాల దెబ్బకి హైదరాబాద్ అతలాకుతలం అయింది. ఇప్పటికే రోడ్లు అన్నీ ఎక్కడికక్కడ చెరువుల్ని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే తెలంగాణా సర్కార్ రెండ్రోజుల సెలవుని కూడా ప్రకటించింది. అయితే కొన్ని అత్యవసర విభాగాల వారు బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. అయితే ఈరోజు ట్రాఫిక్ అప్డేట్ అందించారు పోలీసులు. దాని ప్రకారం ఈ రూట్ లకి వెళ్ళకుండా ఉంటే మంచిది. ఆరాంఘర్ జంక్షన్ దాటి హైదరాబాద్ నుండి కర్నూల్ రోడ్ (NH- 44) పూర్తిగా నీరు వలన లాక్ కాబబడింది. నీరు తగ్గే వరకు ట్రాఫిక్ కదలదు.

దీంతో విమానాశ్రయం మరియు ఎన్‌హెచ్ -44 లోని కర్నూల్ వైపు ఉన్న సాధనాగర్ వెళ్లే వాహనాలన్నీ విమానాశ్రయం & ఎన్‌హెచ్ -44 కి వెళ్లడానికి ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాలని సూచించారు. ఎవరూ పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని ఉపయోగించకూడదు. మెహదీపట్నం నుండి గచిబౌలి వైపు వెళ్లాలనుకునే ప్రయాణికులు టోలిచౌకి ఫ్లైఓవర్‌ను వాడవద్దని సెవెన్ టూంబ్స్ రహదారిని తీసుకోవాలని మరియు గచిబౌలి నుండి వచ్చే ట్రాఫిక్ మెహదీపట్నం షేక్‌పేట, సెనార్ వ్యాలీ, ఫిల్మ్‌నగర్, బివిబి జంక్షన్ మరియు రోడ్ నంబర్ 12 ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. మూసి నది ప్రవహించడం వల్ల పురాణపూల్ 100 అడుగుల రహదారి పూర్తిగా మూసివేయబడింది, ప్రయాణికులు కార్వాన్ వైపు వెళ్ళాలని పోలీసులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version