తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పశువుల మంద మాదిరిగా భక్తులను తోసేశారు. ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పట్టించుకోరు. టీటీడీ వ్యవస్త పూర్తిగా వైఫల్యం చెందడంతోనే తొక్కిసలాట జరిగింది. భక్తులకు నీళ్లు, ఆహారం లేవు.. పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఇవాళ చంద్రబాబు పర్యటన కోసం వందలాది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ తొక్కిసలాట జరిగిన సమయంలో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.
సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తారన్న పవన్ దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దేవుడిని రాజకీయాల కోసం పావులా వాడుకుంటున్నారని తెలిపారు. చనిపోయిన వారికి రూ.20లక్షలు ఎక్స్ గ్రేషియా, గాయపడిన 10లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. లడ్డూ విషయంలో వైసీపీ, జగన్ పై అసత్య ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు.. చేసే చేతలకు పొంతన లేదన్నారు.ఈవో, జేఈవోలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.