చంద్రబాబు పాలనలో పోలీసులను హీనంగా చూశారని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సీఎం వైయస్ జగన్ పాలనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనిి మండిపడ్డారు. చంద్రబాబు అరాచక పాలన గురించి ప్రతి ఒక్కరికి తెలుసని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. చంద్రబాబు అన్ని వ్యవస్థలను బ్రష్టు పట్టించాడని దుయ్యబట్టారు.
చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ గర్జన సూపర్ సక్సెస్ కావడంతో చంద్రబాబు వెన్నులో వణుకు పుడుతుందని ఎద్దేవాా చేశారు. మూడు రాజధానులకు అన్ని ప్రాంతాల వాసులు మద్దతు తెలుపుతున్నారని అన్నారు.