నాగార్జున, బాలయ్య మధ్య గొడవ ఎందుకొచ్చింది..?

-

కింగ్ నాగార్జున మరియు నందమూరి బాలకృష్ణ మధ్య చాలా రోజుల నుంచి ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడటం లేదని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ఈ మధ్య కాలంలో ఒకే వేదికలో ఎక్కడా కనపడలేదు. వీరు హీరోలుగా మంచి క్రేజ్ వున్న రోజుల్లో బాలయ్య బాబు మాస్ ను ఆకర్షించే సినిమాల్లో నటిస్తు వుండే వారు. అదే నాగార్జున మాత్రం మహిళలను , ఫ్యామిలీస్ ను ఎక్కువగా టార్గెట్ చేసే వారు. వీరిద్దరికి అభిప్రాయ భేదాలు ఎక్కడ వచ్చాయి అని ఒక ఇంటర్వ్యూ లో ఒక ఫిల్మ్ జర్నలిస్ట్ ను అడుగగా ఆయన తనకున్న సమచారం పంచుకున్నాడు.

వాస్తవానికి పెద్ద ఎన్టీఆర్ కు అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారికి సినిమాల విషయంలో బాగా పోటీ వుండేదట. ఒకరికంటే ఒకరు బాగా హిట్స్ తీయాలని ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఉండేవారట. అలాగే కొంత మంది హీరోయిన్స్, దర్శకుల విషయం లో ఇద్దరికీ ఘర్షణ వాతావరణం వుండేదట. అలాగే ఇద్దరూ రాజకీయంగా చెరో పార్టీ వైపు వుండేవారట. తర్వాత కాలంలో బాలయ్య బాబుతో  కూడా నాగేశ్వరావుకు ఒక సినిమా విషయంలో గొడవ జరిగిందట.

అప్పటినుండి  బాలయ్యకు నాగార్జునకు పడటం లేదట. అలాగే అఖిల్ మొదటి సినిమా ” A అఖిల్”  రిలీజ్ అయ్యి ప్లాప్ అయినప్పుడు , బాలయ్య ను కొంత మంది విలేకరులు మీ అబ్బాయి ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడని  ప్రశ్నించగా, దానికి మా అబ్బాయి మొదటి సినిమా లోనే ప్రపంచాన్ని రక్షించే పాత్రలు చేయడు అని ఇన్ డైరక్ట్ గా నాగార్జున మీద పంచ్ వేశారట. వాస్తవానికి ఆ సినిమాలో  అఖిల్ పాత్ర  ప్రపంచాన్ని రక్షించే విదంగానే వుంటుంది. దీనితో ఇద్దరి మధ్య గొడవ వుందనే ప్రచారం నిజం అని తెలిసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు బాలయ్య బాబు తన  అన్ స్టాపబుల్  రెండో సీజన్ కు పిలుద్దామని చూస్తున్నా నాగార్జున ససేమీరా అంటున్నాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version