రేపు ఉరవకొండకు సీఎం చంద్రబాబు

-

రాయలసీమకు జీవనాడిగా భావిస్తున్న హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును ప్రాధాన్యతతో పూర్తి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆయన మే 9న అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ఛాయాపురం గ్రామాన్ని సందర్శించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీనీవా ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువల లైనింగ్ మరియు విస్తరణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 2025 జూన్ లోపు ప్రాజెక్టు ఫేజ్-1 పనులను పూర్తిచేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకోవడంతో, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ పనులు తుది దశకు చేరుకున్నాయి.

మొత్తం రూ.3,873 కోట్ల బడ్జెట్‌తో కాలువల సామర్థ్యం 2,200 క్యూసెక్కుల నుండి 3,850 క్యూసెక్కులకు పెరగనుంది. గత టీడీపీ పాలనలో రూ.4,000 కోట్లకుపైగా ఖర్చు చేసి గొల్లపల్లి, మడకశిర, చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్లను పూర్తి చేసి, కియా వంటి పరిశ్రమలకు నీటిని అందించారు. ప్రస్తుతం ఫేజ్-1లో రూ.696 కోట్లు, ఫేజ్-2లో రూ.1,256 కోట్లు ఖర్చు చేస్తూ పనులు జరుగుతున్నాయి. పుంగనూరు బ్రాంచ్ కాలువ (75-207 కి.మీ) రూ.480 కోట్లతో, కుప్పం బ్రాంచ్ కాలువ రూ.197 కోట్లతో వేగంగా నిర్మాణం కొనసాగుతోంది.

చంద్రబాబు పర్యటన షెడ్యూల్:

ఉదయం 9.30: ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరుతారు

10.10: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమాన ప్రయాణం

10.50: పుట్టపర్తి విమానాశ్రయం చేరుకోవడం

11.25: ఛాయాపురం చేరుకోవడం

11.40: హంద్రీనీవా ప్రాజెక్టు పరిశీలన

12.15: ప్రజావేదిక సభలో పాల్గొనడం

3.10: తిరిగి పుట్టపర్తి చేరుకుని బెంగళూరు పయనం

సాయంత్రం: బెంగళూరులో ‘ది హిందూ హడల్: ఇండియా ఇన్ డైలాగ్’ కార్యక్రమంలో పాల్గొనడం

 

Read more RELATED
Recommended to you

Latest news