ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పేదల ఇళ్లకు శాశ్వ‌త పట్టాలు

-

నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ వాసులకు 40 ఏళ్లుగా ఎదురుచూస్తున్న శాశ్వత ఇళ్ల పట్టాల కలను మంత్రి నారాయణ నెరవేర్చారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో, పెన్నా నదీ తీరంలో నివసిస్తున్న 1400 మంది పేదల కుటుంబాలకు శాశ్వత హక్కులు కలిగిన పట్టాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు మంత్రి మండలి నుంచి అధికారిక ఆమోదం లభించింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంత్రి నారాయణ మాట్లాడుతూ – ‘‘భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇది నిజమైన పండుగ రోజు. ఎన్నో సంవత్సరాలుగా అన్యాయం ఎదుర్కొంటున్న ప్రజలకు న్యాయం జరిగే రోజు ఇది. గత ప్రభుత్వం నకిలీ పట్టాలు ఇచ్చి పేదల విశ్వాసాన్ని దెబ్బతీసింది. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు గారి సంకల్పంతో న్యాయమైన, శాశ్వత హక్కులతో కూడిన పట్టాలు అందించబోతున్నాం’’ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన నిలబడుతుందన్నది ఈ నిర్ణయంతో మళ్లీ నిరూపితమైందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news