బాబు విశాఖ టూర్: ప్రజలకు వచ్చే లాభం.. ప్రభుత్వానికి వచ్చే నష్టం ఎంత?

-

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ వ్యవహారం జరిగి చాలా రోజులే అయ్యింది! ఇప్పుడు కొత్తగా ఏదో జరిగినట్లు… బాబు ప్రమాధం జరిగిన ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరితే తప్ప బాధితులకు న్యాయం జరగదన్నట్లు… దాంతో బయపడిపోయి జగన్ అడ్డుకున్నట్లు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు తెలుగుదేశం నేతలు! మనిషి పెరగడం కాదు బుర్ర / బుద్ది పెరగాలని జగన్ అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చినా కూడా ఇంకా ఆ అలవాటునుంచి బయటకు వచ్చినట్లు లేరు! అందుకే తాజాగా బాబు ఏపీ టూర్ పై అవగాహనరాహిత్యపు మాటలు మాట్లాడుతున్నారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు పడిపోతున్నాయి!

ఇంక తప్పదులే.. రాజకీయాల్లో ఉన్నాం.. పైగా ప్రజలు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చారు… కాబట్టి ప్రమాధం జరిగిన వారం అయినా పక్షం అయినా నెల అయినా ఒకసారి అలా వెళ్లి వచ్చేస్తే… మన పత్రికలు ఒక రేంజ్ లో హైలైట్ చేసుకుంటాయని భావించారో ఏమో కానీ… సాయితీగా ఇప్పుడు వైజాగ్ వెళ్లాలని భావించారు బాబు! దీంతో ఇంతకాలం జాతీయ స్థాయిలో అనుమతి తెచ్చుకుంటామని హడావిడి చేసి అభాసుపాలయిన బాబు… గత్యంతరం లేక ఏపీ డీజీపీకి లేఖ రాశారు! అయితే ఏపీ డీజీపీ సోమవారం ఏపీకి రావడానికి బాబుకు అనుమతి ఇచ్చారు! అయితే… అనుకోకుండా జగన్ కరుణించినా మోడీ మోకాలడ్డినట్లుగా.. విమానాల సర్వీసులను సోమవారం నుంచి మంగళవారానికి వాయిదావేశామని పౌరవిమానయాన మంత్రి హర్దీ‌ప్‌సింగ్‌ పురి ట్వీట్‌ చేశారు. దీంతో బాబు విశాఖ పర్యటన మంగళవారానికి వాయిదా పడింది! ఈ ఒక్కరోజులో ఏమి జరిగిపోతుంది? ఇంతకాలం లేని ప్రజలపై ప్రేమ… విశాఖపై దయ… సడన్ గా బాబుకు వచ్చేశాయా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని టీడీపీ నేతలు తెగ హడావిడి చేస్తున్నారు!

చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకునేందుకే ఇలా చేశారాని తెగ ఫీలయిపోతున్నారు టీడీపీ నేతలు! నిజం చెప్పాలంటే… తప్పక వెళ్లడం తప్ప… ఇప్పటికే బాబు ముగ్గురు మేధావులతో ఒక త్రిసభ్య కమిటీ వేసి, విశాఖపై ప్రమాధంపై… ఇది ఐఏఎస్ లను మించిన కమిటీ అన్నట్లుగా చెప్పుకొచ్చారు! తర్వాత కాలంలో ఆ కమిటీ ఏమైంది అన్నది బాబుకే తెలియాలి లేదా వెళ్లిన ముగ్గురు అవగాహన కలిగిన నేతలకు తెలియాలి! దీంతో ఇప్పుడు కొత్తగా కరోనా భయం నుంచి బయటకు వచ్చిన లోకేష్ & చంద్రబాబులు విశాఖ వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అడ్డుచెప్పేది ఏముటుంది? పైగా ఇప్పుడు బాబు విశాఖ వెళ్లడం వల్ల ప్రజలకు వచ్చే లాభం కానీ.. ప్రభుత్వానికి వచ్చే నష్టం కానీ ఏమీ ఉండదు అన్న విషయం బహిరంగ రహస్యమే! ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం ఏదో చంద్రబాబు విశాఖ పర్యటనను కావాలని అడ్డువేసిందని రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకూ సబబో టీడీపీ నేతలే ఆలోచించుకోవాలి!

Read more RELATED
Recommended to you

Exit mobile version