జగన్ని అడగడానికి ఏ ఆభిజాత్యం అడ్డువచ్చింది బాబు!

-

తాను ఏపీకి ప్రతిపక్షన్నాయకుడిని అన్న విషయం మరిచి.. దేశానికే ప్రతిపక్ష నాయకుడిని అనే భ్రమలో బ్రతుకుతున్నారేమో.. అంటూ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి! ఇంతకాలం కరోనా పేరు చెప్పి హైదరాబాద్ లో ఉంటే… పాపం, హైదరాబాద్ లో ఇరుక్కుపోయారు అని చాలామంది భావించేఉంటారు.. ఇది బాబు దురదృష్టం అని చాలా మంది అనుకునే ఉంటారు! కానీ… అది కేవలం బాబు భయమో లేక అజ్ఞానమో లేక అభిజాత్యమో లేక మూర్ఖత్వమో అదీగాక తప్పించుకు తిరిగే పద్దతో అనే కామెంట్లు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుంది… తాజా వైజాగ్ గ్యాస్ లీక్ సంఘటన!

తెలిసి చేస్తారో.. తెలియక చేస్తారో.. అజ్ఞానంతో చేస్తారో.. అతి తెలివితో చేస్తారో తెలియదు కానీ… చంద్రబాబు తాజాగా చేసిన పనితో రాష్ట్రవ్యాప్తంగా విమర్శల పాలవడంతోపాటు… ఇక చంద్రబాబు లేకపోయినా పర్లేదు, ఏపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు అనే స్థాయికి పరిస్థితి చేరిపోయింది!! ఏపీలో కరోనా వచ్చింది.. ప్రజలంతా అల్లల్లాడిపోయారు.. ప్రభుత్వాలు చేయాల్సింది చేస్తూనే ఉన్నాయి. అలాంటప్పుడు ప్రజలకు మరింత ధైర్యం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబుకు బలమైన బాధ్యత ఉంది. కానీ… ఆయన రాలేదు! అనుమతి లేదులే.. అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే! కమ్యునిస్టు నాయకులు, ఇతర నాయకులు చాలా మంది ఇరు రాష్ట్రాల డీజీపీల అనుమతితో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరిగినవారే! వారికి దొరికిన అనుమతి బాబుకు ఎందుకు దొరకదు… మనసులేక కాకపోతే!

ఇక విశాఖ సంఘటన జరిగింది… ముఖ్యమంత్రి హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ వెంటనే స్పందించి.. జగన్ తో మాట్లాడారు! హైదరాబాద్ లో ఉన్న నారాయణ వంటి కమ్యునిస్టు నాయకులు.. జగన్ కు ఫోన్ చేసి, వైజాగ్ బయలుదేరి వచ్చేశారు! కానీ… చంద్రబాబు హైదరాబాద్ ని వదలలేదు. అందరినీ ఆదుకోవాలని, జంతువులకు వైద్యం అందించాలని ట్విట్టర్ లో కోరుతున్నారు!! ఇంతకూ చంద్రబాబు ఎందుకు వెళ్లలేదో తెలుసా… కేంద్రం నుంచి అనుమతి రాలేదంట! చంద్రబాబు విశాఖకు వెళ్లడానికి కేంద్రం నుంచి అనుమతి ఎందుకు… జగన్ ఒప్పుకుంటే చాలుగా అనుకునేరు! జగన్ ను అడిగితే చంద్రబాబుకి నామోషీ కదా మరి!!

చంద్రబాబు అలానే అనుకున్నట్లున్నారు… ఆంధ్రకు కారులో వెళ్లాలంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, డీజీపీలు కానీ అనుమతి ఇస్తే చాలు! కారులో కష్టం అనుకుంటే… బోలెడు కార్పొరేట్ సంస్థలకు, బడా బాబులకు స్వంత విమానాలు హైదరాబాద్ లో ఉన్నాయి.. బాబు అడిగితే ఇవ్వము అనే పరిస్థితి ఉండదు! కానీ చంద్రబాబు… అటు తెలంగాణను కానీ, ఇటు ఆంధ్రా ని కానీ సంప్రదించకుండా నేరుగా కేంద్రాన్ని సంప్రదించారంట! ముంబాయిలో ఉన్న విమానాన్ని హైదరాబాద్ రప్పించుకునేందుకు, అలాగే హైదరాబాద్ నుంచి ఆంధ్రకు వెళ్లేందుకు అనుమతి కావాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరారంట… కానీ అక్కడ నుంచి స్పందన కరువైందట… మళ్లీ చేస్తే ఫోన్ ఎత్తలేదో ఏమో!!

దీంతో… బాబు సైలంట్ అయిపోయి, ట్విట్టర్ లోకి వచ్చేశారు! ఇంతోటి దానికి కేంద్రానికి ఫోన్ చేయడం అవసరమా… జగన్ కి ఒక్క చాల్ చేస్తే చాలుగా! అంతేనా… కేంద్రానికి చర్యల మీద లేఖరాసా.. కేంద్రమంత్రి పియూష్ గోయల్ ని ట్యాగ్ చేశా అంటూ ట్వీట్ లు వేసి ఊరుకున్నారు. నిజానికి ఆ లేఖ చంద్రబాబు రాయాల్సింది రాష్ట్రానికి.. ఆయన రాష్ట్రానికి ప్రతిపక్షనాయకుడె కాని కేంద్రానికి కాదుగా!! పశువైద్యుల్ని పంపమని పియూష్ గోయల్ కు లేఖ రాయడంలో బాబు రాజకీయ పరిణితిని ఎలా అర్ధం చేసుకోవాలి? పైగా ఈ సమయంలో అన్నీ చూసుకోవాల్సింది, చూసుకున్నదీ రాష్ట్ర ప్రభుత్వం… బాబుకి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందిగా!! ఇవన్నీ మరిచిన చంద్రబాబు… ఇలాంటిపనులు చేయడాన్ని ఎలా చూడాలి? జగన్ని అడగడానికి ఏ ఆభిజాత్యం అడ్డువచ్చింది బాబు!

Read more RELATED
Recommended to you

Exit mobile version