చంద్రబాబు ఎడమ చేతికి రింగు.. నెక్స్ట్ సీఎం కాబోతున్నాడా !

-

2019 ఎన్నికల తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బ్యాడ్ టైం నడుస్తోంది. అటు ఏపీలో అధికారం కోల్పోవడం… ఇటు తెలంగాణలో పార్టీ పూర్తిగా భూస్థాపితం కావడం తో… చంద్రబాబు డీల పడిపోయాడు. ఇక తాజాగా కుప్పం మున్సిపల్ కూడా వైసిపి కైవసం కావడంతో… తీవ్ర ఆందోళన చెందుతున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇక వచ్చే 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించాలని… స్కెచ్ వేస్తున్నారు బాబు.

 

ఈ నేపథ్యంలోనే నారా చంద్రబాబు నాయుడు ఎడమ చేతికి ఓ ఉంగరం ప్రత్యక్షమైంది. ప్రస్తుతం ఈ ఉంగరం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారడం గమనార్ధం.చంద్రబాబు నాయుడు ఎడమ చేతి చూపుడు వ్రేలుకు రింగ్ ఉంది. ఆధునిక సాంకేతికతతో కూడిన రింగ్ ను ధరించిన చంద్రబాబు నాయుడు…రింగ్ లో మైక్రో చిప్….చంద్రబాబు ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు మరోచోట నుంచి మానిటర్ చేసేలా అధునాతన రింగ్ ధరించారు. బిపి, హార్ట్ రేట్, నిద్ర సమయం తదితర ఆరోగ్య వివరాలు చిప్ లో నమోదు చేశారు. అంతేకాదు తన రింగ్ గురించి పార్టీ క్యాడర్ కు వివరించిన చంద్రబాబు… ప్రతి కార్యకర్త ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version