ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంచల వ్యాఖ్యలు చేశారు.నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబుకు 45 ఏళ్ల అనుభవం ఉందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రొద్దుటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ…అబద్దాలు చెప్పేవారు, కుట్రలు చేసేవారు మనకు ప్రత్యర్థులుగా ఉన్నారని అన్నారు.
కూటమంతా ఏకమై, ఒకే ఒక్క జగన్ మీద పోటీకి వస్తుందన్నారు.చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ సరిపోవన్నట్టుగా తనపై బురద జల్లేందుకు తన ఇద్దరు చెల్లమ్మలను కూడా తనపై యుద్దానికి తీసుకువచ్చుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.విలువలులేని ఈ రాజకీయాలు ఎవరి స్ఫూర్తిదాయకం అని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. ప్రజల అకౌంట్లో 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా వేశమని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేసి వైసీపీని రెండోసారి గెలిపించాలని ప్రజలకు సూచించారు. 58 నెలల్లో అధికారాన్ని ఒక బాధ్యతగా నిర్వర్తిచామన్నారు .మేనిఫెస్టోను ఒక పవిత్రగ్రంధంగా భావించామని ఆయన అన్నారు. అదే టిడిపి అయితే ఎన్నికలు అయిపోగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తుందని ఆరోపించారు .