వైఎస్ఆర్ సీపీ నేత మరియు సినీ నటుడు పృథ్వీరాజ్ మొన్న రైతుల గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. తాను చూసినంత వరకు రైతులు ఏదో బురదలో పని చేసుకుంటూ దొరికింది తింటూ ఉంటారని వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో అతనిపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిని నారా లోకేష్ కూడా ప్రస్తావిస్తూ ఆ వీడియో పెట్టి వైసీపీ నాయకుల నిజ స్వరూపం ఇది అంటూ వారిని ఒక రేంజ్ లో ఆడుకున్నాడు.
అయితే ఈ పరిస్థితిని ఎలా డీల్ చేయాలి అని వైసీపీ నేతలు తలలు బద్దలు కొట్టుకుంటున్న నేపథ్యంలో మరో సినీ నటుడు పోసాని కృష్ణ మురళి వచ్చి జగన్ నెత్తిన పాలుపోసినంత పని చేశాడు. వైసిపి మద్దతుదారులైన పోసాని మాట్లాడుతూ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం బాగాలేవు అని…. అతను వెంటనే రైతులందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు.
రైతులు అన్నాకా చొక్కా, ప్యాంట్లు వేసుకోకూడదా? సెల్‌ఫోన్లులల్లో మాట్లాడకూడదా? ఖరీదైన బట్టలు వేసుకోరూడదా? అని ప్రశ్నించారు. ఏ మాత్రం నైతికత, వెంకటేశ్వర స్వామిపై భక్తీ ఉన్న సరే వెంటనే అమరావతి రైతులకి, ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని, అప్పుడే ఆ దేవుడు క్షమిస్తాడని చెప్పుకొచ్చారు.