అబద్ధానికి ఆధార్‌ కార్డు చంద్రబాబు : ఎమ్మెల్సీ వరుదు కల్యాణి

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.అబద్ధానికి ఆధార్‌ కార్డు చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.బీసీ ప్రధానమంత్రిని దూషించిన బీసీ వ్యతిరేకి చంద్రబాబు అని ఆరోపించారు . తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె చంద్రబాబు హామీలపై తీవ్రస్థాయిలో విమర్శించారు. బీసీలకు వెన్నెముక జగనన్న అయితే..వెన్నుపోటు చంద్రబాబు అని విమర్శించారు. జగనన్న పాలనలో బీసీలు బాద్‌షాలు..!అని అన్నారు. రాజ్యాంగం నిర్ధేశించిన దానికంటే జగనన్న పాలనలో బీసీలకు మరిన్ని అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది .

బీసీ వ్యతిరేకి చంద్రబాబు అంటూ అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్పీ వరుదు కల్యాణి. ఎన్నికల సమయంలో బాబు చెబుతున్న బీసీ డిక్లరేషన్‌ అంటే బాబు చీటింగ్‌ డిక్లరేషన్‌ అని వరుదు కల్యాణి ఆరోపించారు . మసాలా దట్టించి పాత హామీలనే బాబు బయటకు తీశారని విమర్శించారు.. గత హామీలను తుంగలో తొక్కిన బాబుకు సిగ్గునిపించడం లేదా అని వరుదు కల్యాణి ప్రశ్నించారు .

Read more RELATED
Recommended to you

Latest news