ఏపీ చంద్రబాబుకు అరుదైన రాజకీయ హోదా దక్కింది. ప్రస్తుతం ఆయన కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నారు. దీంతో ఆయనకు పదవువే కాకుండా రాష్ట్రానికి నిధులు సైతం భారీగానే అందుతున్నాయి. కేంద్రం నుంచి మోడీ తీసుకునే నిర్ణయాల్లో చంద్రబాబు కీ రోల్ పోషిస్తున్నారు.
తాజాగా కేంద్రహోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఏర్పాటైన అంతర్రాష్ట్ర మండలి స్థాయీ సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఇందులో సీఎం చంద్రబాబుతో సహా ఏడు రాష్ట్రాల సీఎంలు, ఐదుగురు కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు అంతర్రాష్ట్ర మండలి ఉండాలని ఆర్టికల్ 263 పేర్కొంది. రాష్ట్రాల మధ్య వివాదాలను కేంద్రం, రాష్ట్రాల మధ్య సమస్యలను పరిశీలించి సలహా ఇవ్వడం దీని బాధ్యత. ఇందులో ఏపీ సీఎంకు చోటుదక్కడం మంచి పరిణామమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.