తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. కనుక విద్యార్థులు దీన్ని గమనిస్తే మంచిది. ఐఐటీ, ఎంసెట్ విద్యార్థులకు సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. సాధారణంగా ప్రతీ ఏటా ఐఐటీ అడ్మిషన్‌లు పూర్తయిన తరువాత రాష్ట్రంలో ప్రవేశాలు స్టార్ట్ అవుతాయి. కానీ ఈసారి అలా కాదు. ఐఐటీ ప్రవేశాలకంటే ముందుగానే ఈ సారి ప్రవేశాలు మొదలు పెట్టనున్నారు.
జూలై 14, 2022 నుంచి జూలై 20, 2022 వరకు రాష్ట్రంలో ఎంసెట్ నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఆలస్యం అవ్వడంతో ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇక ఇది ఇలా ఉంటే ముందుగానే కౌన్సెలింగ్ నిర్వహించడం వల్ల చాలా మంది విద్యార్థులు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. నెక్స్ట్ ఐఐటీ లో వచ్చే ర్యాంక్ ని బట్టి అందులో చేరుతారు.
దీని ద్వారా కాలేజీలో సీట్లు ఖాళీగా మిగిలిపోతాయి. ఈ నేపథ్యంలో ఖాళీలు ఏర్పడిన సీట్ల భర్తీకి ఎంసెట్‌లో మరో విడత కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ సమస్య జూలై 3, 2022న జరగాల్సిన ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఆగస్టు 28, 2022కు మార్చడంతో వచ్చింది. ఇక ఇది ఇలా ఉంటే జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కు సంబంధించి తేదీలను ఐఐటీ బాంబే రీ షెడ్యూల్ చేసింది.
జులై 3 వ తేదీన పరీక్షలను నిర్వహించాలి కానీ ఆగస్టు 28కి రీ షెడ్యూల్ చేశారు. పరీక్ష ఫీజును ఆగస్టు 12 వరకు చెల్లించవచ్చు. అభ్యర్థులు ఆగస్టు 23 నుంచి 28 వరకు ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చెయ్యచ్చు. జేఈఈ మెయిన్ తేదీలను మార్చడంతో జేఈఈ అడ్వాన్స్డ్ తేదీలను కూడా మార్చాలి అని ఐఐటీ బాంబే వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ పరీక్షలను జూన్, జులైలో నిర్వహించున్నట్లు వెల్లడించింది. జేఈఈ మెయిన్ రెండో విడత జులై 30తో ముగుస్తుంది.