పెదవులు పొడిబారిపోతున్నాయా…? అయితే ఈ పద్ధతులు పాటించండి…!

-

చాలా మందికి తరచుగానే పెదవుల పై పొర రాలుతూ ఉంటుంది. దీనికి కారణం శరీరం లో జరిగే మార్పులు మరియు వాతావరణం లో వచ్చే మార్పులు. అంతేకాదు పెదవులు పొడిబారడానికి చాలా కారణాలు ఉన్నాయి.

పెదవులు ఎందుకు పొడిబారతాయి?

ఎక్కువగా పని చేయడం వల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థ లో మార్పులు వస్తాయి, దాంతో ముందుగా మార్పు కనిపించేది పెదవుల లోనే.

ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల శరీరం తేమను కోల్పోతుంది, దాని వల్ల పెదవులు పొడిబారతాయి.

మంచి క్వాలిటీ లేని లిప్స్టిక్ వాడటం వల్ల కూడా పెదవులు పొడిబారే అవకాశం ఉంది. అంతే కాదు దాని వల్ల పెదవులు చిట్లి పోతాయి కూడా.

ఆల్కహాల్ మరియు కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీని వల్ల పెదవులు పొడిబారతాయి.

ఎక్కువగా స్మోక్ చేసేవారి పెదవులు కూడా పొడిబారతాయి.

సహజంగా ఎక్కువ మంది పెదవులు మృదుత్వాన్ని, వాతావరణం లో జరిగే మార్పులు వల్ల కోల్పోతారు. ఎందుకంటే పెదవులు ఎక్కువ చలిని, ఎక్కువ వేడిని తట్టుకోలేవు. దానితో తేమ కోల్పోయి, పొడిబారతాయి.

అంతే కాదు విటమిన్ బి డెఫిషియెన్సీ, థైరాయిడ్ సమస్య మరియు ఐరన్, జింక్ శాతం తక్కువగా ఉన్నా పెదవులు పొడిబారడం జరుగుతుంది.

పెదవుల మృదుత్వానికి ఏం చేయాలి ?

తరచుగా లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లీని పెదవుల పై రాస్తూ ఉండాలి.

ఎక్కువ నీరు తాగకపోవడం వల్ల పెదవులు పొడిబారితే రోజుకు ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు తాగాలి.

సిగరెట్ స్మోకింగ్ మానేయాలి.

ప్రతి రోజు లిప్ స్క్రబ్ చేసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. పెదవులపై ఉండే డెడ్ స్కిన్ తొలగిపోయి, తేమ చేకూరుతుంది. దాంతో పెదవులు మృదువుగా మారుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news