పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థుల ప్రకటన..

Join Our Community
follow manalokam on social media

తెలంగాణలో జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవుల కోసం అభ్యర్థులను ఖరారు చేసి అధికారికంగా ప్రకటించింది బీజేపీ జాతీయ పార్టీ ఆఫీస్. రంగా రెడ్డి,హైదరాబాద్, మహబూబ్ నగర్ నియోజకవర్గ అభ్యర్థి గా సిటింగ్ ఎమ్మెల్సీ రామ చందర్ రావ్ పేరును, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి గా ప్రేమేందర్ రెడ్డి పేరుని కొద్ది సేపటి క్రితమే ప్రకటించారు. ఇక అంతకు ముందు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

మళ్ళీ గుర్రంపోడు తండా వెళ్తాము…పెరేడ్ నిర్వహిస్తామని అన్నారు. మొన్నటి సంఘటనలో ఎంతమంది ని అరెస్ట్ చేస్తారో అక్కడికి వచ్చి చేసుకోండని ఆయన అన్నారు. సీఎం వస్తాడో, ఇంటిలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు వస్తాడో రండి.., ఎంత మంది ని గుర్తించి అరెస్ట్ చేస్తారో చేసుకోండని ఆయన సవాల్ విసిరారు. నాగార్జున సాగర్ లో ఈ నెలలోనే భారీ బహిరంగ సభ పెడుతున్నామన్న ఆయన నాగార్జున సాగర్ అభ్యర్థి ని ఇంకా ఖరారు చేయలేదని అన్నారు. ఈ రెండు ఎమ్మెల్సీలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తామని ఆయన అన్నారు.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....