ఈ రోజు దేశంలోని రెండు రాష్ట్రాలలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఛత్తీస్ ఘడ్ లో జరిగిన తొలిదశ పోలింగ్ లో కేవలం 20 స్థానాలకు మాత్రమే. ఉదయం 6 గంటల నుండి ప్రారంభం అయిన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. అయితే నమోదు అయిన పోలింగ్ శాతం చూస్తే 70 .87 గా ఉంది. ఇక గతంలో జరిగిన ఓటింగ్ శాతం కన్నా 6 శాతం తక్కువ అని చెప్పాలి. అదే విధంగా మిజోరాం లో ఎన్నికల్లో భాగంగా 40 స్థానాలలో మాత్రమే పోలింగ్ ను నిర్వహించగా 77 .04 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఇక ఛత్తీస్ ఘడ్ లో మిగిలిన 70 స్థానాలకు గాను నవంబర్ 17వ తేదీన ఎన్నికలను నిర్వహించనున్నారు. కాగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అదికారంలో ఉండగా… ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బీజేపీ ప్రయత్నాలను చేస్తోంది.
ఈ రాష్ట్రంలో ఉన్న 90 స్థానాలకు గాను ఇప్పటికే స్థానాలలో ఎన్నికలు జరిగాయి . మిగిలిన రెండు దశలలో ఎన్నికలు నిర్వహించనున్నారు. గెలుపు ఎవరికి అనుకూలంగా రానుందో త్వరలోనే తెలియనుంది.