ఫాస్టాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారా..? ఇలా ఎస్‌ఎంఎస్ పంపితే చాలు..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. తాజాగా కొత్త సేవలను స్టేట్ బ్యాంక్ తీసుకు వచ్చింది. ఫాస్టాగ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకునేందుకు కొత్త అవకాశాన్ని కల్పిస్తోంది. పూర్తి వివరాలలోకి వెళితే..

కేం ద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ సర్వీసులను తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా డ్రైవ్ చేస్తూనే డబ్బులు కట్టేయచ్చు. ఈ వెహికిల్ కోసం తీసుకున్న ఫాస్టాగ్‌ కి అకౌంట్‌ను లింక్ చేయడం వలన అకౌంట్ నుంచే టోల్ ఫీజులను కట్టేయొచ్చు. అయితే ఫాస్టాగ్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

ఫాస్టాగ్ బ్యాలెన్స్‌ను ఎస్ఎంఎస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ విషయాన్నిట్విటర్ ద్వారా వెల్లడించింది. దీని కోసం మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి 7208820019 ఎస్ఎంఎస్ పంపండి. ఎస్ఎంఎస్ ద్వారా మీరు వెంటనే మీ ఎస్‌బీఐ ఫాస్టాగ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. దీని కోసం కస్టమర్స్ మొబైల్ నెంబర్‌ను బ్యాంకు వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి వుంది. స్టేట్ బ్యాంక్ తీసుకొచ్చిన ఈ ఫెసిలిటీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news