రైలులో సిగరెట్ కాల్చిన మహిళ వీడియో వైరల్ గా మారింది. గాంధీధామ్–విశాఖపట్నం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Train No. 20804) లోని ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ఒక మహిళ సిగరెట్ కాల్చడం వివాదంగా మారింది. ఈ సంఘటన వివరాలలోకి వెళితే… గాంధీధామ్-విశాఖపట్నం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ కంపార్ట్‌మెంట్‌లో ఒక మహిళ సిగరెట్ కాల్చింది.

దీనిపై అభ్యంతరం తెలిపిన తోటి ప్రయాణికులపై ఆమె ఎదురుదాడి చేసింది. రైలు నంబర్ 20804లో జరిగిన ఈ ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలులో సిగరెట్ కాల్చడం చట్టవిరుద్ధం. దీనిపై రైల్వే పోలీసులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
#WATCH | Video Of Woman Smoking Inside Passenger Train Goes Viral#Trending #Train #Video #ViralVideo #Viral pic.twitter.com/AY1hvU4V69
— TIMES NOW (@TimesNow) September 15, 2025