కేదార్‌ బ్యాటింగ్‌ పై క్రికెట్‌ అభిమానులు సెటైర్లు…!

IPLలో కేదార్‌ బ్యాటింగ్‌పై క్రికెట్‌ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. టీ-20 మ్యాచ్‌లో టెస్టు ఇన్నింగ్స్ ఆడాడని, అతనికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఇవ్వాలని ట్రోల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌. తన పేలవమైన బ్యాటింగ్‌తో జట్టు ఓటమికి కారణమయ్యాడంటూ చెన్నై ఆటగాడు కేదార్‌ జాదవ్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇంకొందరు.

కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ధోని ఔట్‌ అయ్యాక క్రీజులోకి వచ్చిన కేదార్‌ టెస్ట్‌ మ్యాచ్‌ తరహాలో ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. అప్పటికే జట్టుకు కావాల్సింది 39 పరుగులు.. చేతిలో ఉన్నది కేవలం 21 బంతులు. మొత్తంగా జాదవ్‌ 12 బంతులు ఎదుర్కొని 7 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో చెన్నై ఖాతాలో మరో ఓటమి చేరింది.