టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై..మ్యాచ్‌ కు దూరమైన రోహిత్‌ శర్మ

ఐపీఎల్ – 2021 రెండో భాగం ఇవాళ ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే… ఈ రెండో భాగం లో మొదటి మ్యాచ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరియు ముంబై ఇండియన్స్‌ మధ్య జరుగుతోంది. అయితే.. కాసేపటి క్రితమే… ఈ మ్యాచ్‌ టాస్‌ ప్రక్రియ పూర్తి అయింది.

దీంతో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోని. చెన్నై  టాస్‌ గెలవడంతో ముంబై జట్టు ఛేజింగ్‌ కు దిగనుంది. అయితే… చెన్నై మ్యాచ్‌ కు ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరం అయ్యాడు. రోహిత్ ఫిట్‌ గా లేనట్లు సమాచారం అందుతోంది. దీంతో రోహిత్‌ శర్మ స్థానం లో పొలార్డ్‌‌ కెప్టెన్‌ గా వ్యహరిస్తున్నాడు. అటు ఈ మ్యాచ్‌ కు హర్దిక్‌ పాండ్య కూడా ఆడటం లేదు.  ఇక ఈ మొదటి మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. టీవీల్లో అయితే.. స్టార్‌ స్పోర్ట్స్‌ అలాగే… మొబైల్స్‌ లో అయితే… హాట్‌స్టర్‌ లో చూడవచ్చు.