ఐపీఎల్ లో నేడు ఆసక్తికర ఫైట్.. చెన్నై vs ఢిల్లీ, బలాబలాలు ఇవే !

-

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ లు మొదలయ్యాయి. మొదటి మ్యాచ్ గా  నిన్న చెన్నై వేదికగా ముంబై, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగి చివరికి బెంగళూరు వశం అయింది. ఈ రోజు రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఒక జట్టుకు కెప్టెన్ ధోని కాగా.. మరో జట్టుకు కెప్టెన్ రిషబ్ పంత్. ఈయన మొదటిసారి కెప్టెన్సీ బాధ్యత తీసుకున్నాడు. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ పోరులో ఇరు జట్ల బలా బలాలు చూస్తే చెన్నైకి ఓపెనింగ్ పెద్ద సమస్య అయితే ఢిల్లీకి బౌలింగ్ ప్రధాన సమస్య. అదీ కాక అయితే ఈ రోజు మ్యాచ్‌లో నలుగురు కీలక ఆటగాళ్లు ఆడట్లేదని అంటున్నారు.

ఢిల్లీ జట్టు విషయానికి వస్తే ఢిల్లీ పేస్ ద్వయం నోర్తెజా, రబాడా ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో.. ఢిల్లీకి డెత్ ఓవర్లు ప్రధాన సమస్యగా మారింది. అక్షర్ పటేల్ కూడా లేకపోవడంతో స్పిన్ పరిస్థితి కూడా ఇదే తీరులో ఉంది. అలాగే చెన్నై విషయానికి వస్తే ఓపెనింగ్ జోడీ పెద్ద సమస్య సీఎస్కేకి ఓపెనింగ్ జోడీ పెద్ద ఇబ్బందిగా మారింది. మరి చూడాలి ఏమి జరుగుతుందో ?

చెన్నై సూపర్ కింగ్స్  XI అంచనా,

1) ఫాఫ్ డుప్లెసిస్, 2) రాబిన్ ఉతప్ప / రుతురాజ్ గైక్వాడ్, 3) అంబటి రాయుడు, 4) సురేష్ రైనా, 5) సామ్ కుర్రాన్, 6) ఎంఎస్ ధోని (సి / డబ్ల్యు కె), 7) రవీంద్ర జడేజా, 8) మొయిన్ అలీ, 9) శార్దుల్ ఠాకూర్, 10) దీపక్ చాహర్, 11) ఇమ్రాన్ తాహిర్

ఢిల్లీ  XI అంచనా

1) పృథ్వీ షా, 2) శిఖర్ ధావన్, 3) అజింక్య రహానె, 4) షిమ్రాన్ హెట్మియర్, 5) రిషబ్ పంత్ (సి / డబ్ల్యుకె), 6) మార్కస్ స్టోయినిస్, 7) ఆర్ అశ్విన్, 8) అమిత్ మిశ్రా, 9) క్రిస్ వోక్స్, 10) ఇశాంత్ శర్మ, 11) సామ్ బిల్లింగ్స్

Read more RELATED
Recommended to you

Latest news