చికెన్, గుడ్డులో ఏది బెస్ట్.. ప్రోటీన్స్ దేనిలో ఎక్కువ

-

కోడి ముందా? గుడ్డు ముందా? అని అందరూ సరదాగా అడుగుతుంటారు. అయితే దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ అందులో ఉండే ప్రొటీన్ల పరంగా ఇందులో ఏది ఉత్తమం తెలుసుకుంటే మనకిప్పుడెంతో లాభం. డైట్‌లో భాగంగా ఇప్పుడు ఈ రెండింటినీ చేర్చారు వైద్య నిపుణులు.

chicken
chicken

అయితే యూఎస్‌డీఏ ప్రకారం 100 గ్రాముల బరువున్న ఉడికించిన గుడ్డులో 155 కిలో కేలరీల శక్తి, 12.58 గ్రా. ప్రోటీన్, 1.12 గ్రా. కార్బోహైడ్రేట్లు, 10.61 గ్రా. కొవ్వు ఉంటుంది. అయితే, గుడ్డులో ఉండే కొవ్వు మన శరీరంలోని రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని పెంచదని ఇటీవల అధ్యయనాలు తెలిపాయి. మొత్తం గుడ్డును నిరభ్యంతరంగా తినేయవచ్చని సూచించాయి.

అదనంగా, అదే మొత్తంలో గుడ్డులో కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం, జింక్, రాగి, మాంగనీస్, సెలీనియం, ఫ్లోరైడ్, విటమిన్ ఏ, విటమిన్ బీ కాంప్లెక్స్, విటమిన్ కే ఉంటాయి. అలాగే, గుడ్డు పచ్చసొనలో లుటిన్, జియాక్సంతిన్ లాంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కండర నిర్మాణం, బరువు తగ్గడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు గుడ్డు చాలా తోడ్పడుతుంది.

ఇక మనకు ప్రొటీన్‌ రిచ్‌ ఫుడ్‌ అంటే టక్కున గుర్తుకొచ్చేవి చికెన్, కోడిగుడ్లే. ప్రపంచవ్యాప్తంగా ఫిట్‌నెస్ ఔత్సాహికులు చికెన్‌ను బాగా తింటారు. ఎందుకంటే ఇందులో ఉండే ప్రొటీన్లు కండర శక్తిని పెంపొందిస్తాయి. యూఎస్ వ్యవసాయ శాఖ (యూఎస్‌డీఏ) ప్రకారం.. 100 గ్రాముల చికెన్ 143 కిలో కేలరీల శక్తిని, 24.11 గ్రా. ప్రోటీన్, 2.68 గ్రా. కార్బోహైడ్రేట్లను, 3.12 గ్రాముల లిపిడ్లు లేదా కొవ్వును అందిస్తుంది. దీంతోపాటు అదే మొత్తంలో చికెన్‌లో మన శరీరానికి కావాల్సిన కాల్షియం, ఐరన్, సోడియం, విటమిన్ ఏ, విటమిన్ సీ ఉంటుంది. అయితే, బరువు తగ్గాలనుకునేవారు, ఫిట్‌నెస్‌ సాధించాలనుకునేవారు చికెన్‌ బ్రెస్ట్‌ను మాత్రమే తీసుకోవాలి. వెయిట్‌ గెయిన్‌ అవ్వాలనుకున్నవారు చికెన్‌ లెగ్స్‌, వింగ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.

చికెన్‌, గుడ్లు రెండూ ప్రొటీన్‌రిచ్‌ ఆహార పదార్థాలే. కావున మన బాడీకి సరిపోయే ప్రొటీన్‌ అందించాలంటే ఈ రెండింటినీ సమానంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకేవేళ చికెన్‌ తీసుకోవడం మీకు సాధ్యం కాకుంటే గుడ్లను ప్రతిరోజూ తీసుకోవాలని పేర్కొంటున్నారు. గుడ్లను క్రమం తప్పకుండా తీసుకున్నా మనకు కావాల్సిన ప్రొటీన్లను పొందవచ్చని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news