సుప్రీంకోర్టు కార్యకలాపాలు అన్నీ ప్రత్యక్ష ప్రసారాలకు తాను సిద్ధంగా ఉన్నట్లు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ సంచలన ప్రకటన చేసారు. సహా న్యాయమూర్తులతో చర్చించి ఏకాభిప్రాయంతో రానున్న రోజుల్లో కోర్టు కార్యకలాపాలు అన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసాము అని ఆయన వెల్లడించారు. ఒక జర్నలిస్టుగా బస్సులో తిరిగి వార్తలు సేకరించిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయి అని అన్నారు.
ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో కోర్టు వార్తల కోసం జర్నలిస్టులు పడుతున్న బాధలు తమకు తెలుసని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ఇక నుంచి జర్నలిస్టులు కోర్టు కార్యకలాపాల కోసం ఎటువంటి సమస్యా చూడకూడదు అనే ఈ యాప్ రూపకల్పనకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. మీడియా, సుప్రీంకోర్టు మధ్య అనుసంధానం, వారధిగా వ్యవహరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు వివరించారు. అక్రిడేషన్ల మంజూరులో ఎవరికి అన్యాయం జరగకుండా హేతుబద్ధతతో వ్యవరించేలా.. చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.