అవును మీరు చదువుతున్నది నిజమే ఇక మీదట మనం చికెన్ తినాలంటే దాని కోసం కోడిని కోయక్కర లేదు. అసలు కోడితో పని లేకుండానే చికెన్ ను సృష్టించారు మన శాస్త్రవేత్తలు. ప్రపంచంలోనే తొలిసారిగా ల్యాబ్ లో తయారైన కోడి మాంసం వినియోగించేందుకు సింగపూర్ ప్రభుత్వం తాజాగా అనుమతులు ఇచ్చింది.
అమెరికాకు చెందిన ఈట్ జస్ట్ అనే కంపెనీ ఈ మొదటి అనుమతి దక్కించుకుంది. కోడి కణాలను ఓ బయో రియాక్టర్ లో ఉంచి వాటికి కావలసిన ప్రోటీన్లను అందిస్తూ వస్తారు. అవి విభజన చెంది కణ జాలాలు గా మారి చికెన్ గా తయారవుతుంది. ఆ కణ జాలాలు మనకు కావలసినంత సైజు పెరిగిన తర్వాత ఆ మాంసాన్ని మనం వాడుకో వచ్చు. నిజానికి చెప్పాలంటే ఈ ప్రపంచంలో చికెన్ కోసం కోళ్లను పుట్టించి మరల చికెన్ కోసం వినియోగిస్తున్నారు. దాని కంటే ఈ పద్ధతి బెటర్ అని చెప్పవచ్చు.